ఐ.ఐ.టి – ఐ.టి.ఐ

గిరి గారు వ్రాసిన A bolt from the blue అనే టపా చూశాక నాకు ఇది గుర్తొచ్చింది.

మా మిత్రుడొకరికి, ఐ.ఐ.టి బాంబే లో సీటు వచ్చింది. బాంబే వెళ్లబోయే ముందు బట్టలు కుట్టించుకోడానికి వాళ్ల ఇంటి దగ్గరున్న టైలరుకు దగ్గరకు వెళ్లాడు. అప్పుడు వారి మద్య జరిగిన సంభాషణ ఇది.

టైలరు: చదువుకోడానికి బొంబాయి వెళ్తున్నావటగా?

మిత్రుడు: అవును ఐ.ఐ.టి బొంబాయిలో సీటొచ్చింది.

టైలరు: ఇంకొంచం కష్టపడి చదివితే గుంటూరు డాన్ బాస్కో ఐ.టి.ఐ లోనే సీటొచ్చేది కదా. మీవాళ్లు నిన్నంత కష్టపడి చదివిస్తోంటే నువ్వామాత్రమైనా చదవకపోవడం ఏం బాగాలేదు.

అంతే మావాడు తరువాత ఇంకెప్పుడు ఆ టైలరు దగ్గరకు వెళ్లలేదు 🙂

ప్రకటనలు

క్రికెట్టులో భారత పరాజయానికి కారణమయిన ఇద్దరు

1. ఇందిరాగాంధీ – బాంగ్లాదేశ్ ఏర్పాటు చేసినందుకు..

2. హనుమంతుడు – లంకను పూర్తిగా కాల్చనందుకు..

(నాకు వచ్చిన ఫార్వర్డు మెయిలు నుండి)

మరో అమ్మాయి

రావుగారు మాట్లాడే అమ్మాయిని మీకు చూపించారు కదా? ఇప్పుడు ఇంటర్నెట్టులో మీకు కావలసినది వెదికి పెట్టే ఈవిడని చూడండి.