నెంబర్‌ వన్‌ ఆంధ్రుడు ‘అన్న’గారే…

హైదరాబాద్‌, నవంబర్‌ 13 (ఆన్‌లైన్‌) ఆత్మగౌరవ నినాదంతో తెలుగు జాతి కీర్తిని ప్రపం చానికి చాటిన స్వర్గీయ నందమూరి తారకరామా రావు రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారనేది మరోసారి రుజువైంది. గత 50 ఏళ్లలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన ఆంధ్రుడు ఎవరనే అంశంపై సిఎన్‌ ఎన్‌- ఐబిఎన్‌ ఛానల్‌ ఆన్‌లైన్‌ పోల్‌ను నిర్వహించిం ది. ఇందులో పాల్గొన్న వారిలో అత్యధికంగా 70 శాతం మంది ఎన్టీఆర్‌కే ఆ ఘనత దక్కుతుందని తేల్చిచెప్పారు. ఎన్టీఆర్‌ను మించిన ఖ్యాతిగాంచిన తెలు గోడు లేడని అభిప్రాయపడ్డారు. నటరత్న తర్వాత తెలు గు సినీ పరిశ్రమను ఏలుతున్న మెగాస్టార్‌ చిరంజీవికి రెండోస్థానం దక్కింది. 23 శాతం మంది చిరంజీవికి ఓటే శారు. దక్షిణాది రాష్ట్రాలు స్వర్ణోత్సవా లను జరుపుకుం టున్న సందర్భంగా సిఎన్‌ఎన్‌- ఐబిఎన్‌ ఆయా రాష్ట్రాల్లో ఈ పోల్‌ను నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మిగతా అందరి ఓట్లు కలిపినా ఎన్టీఆర్‌కు వచ్చిన వాటిలో సగం కూడా లేకపోవడం… గతించి దశాబ్దకాలం గడిచినా ఆ మహానటుడు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయి లో నిలిచిపోయారనేందుకు తార్కాణం. ఎవరికి ఎంత శాతం ఓట్లు పోలయ్యాయనే వివరాలు…

 

ఎన్‌టి రామారావు 70 శాతం

చిరంజీవి 23 శాతం

సత్యసాయి బాబా 2.6 శాతం

రామలింగరాజు (సత్యం) 1.7 శాతం

సానియా మీర్జా 1.5 శాతం

మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ (ఏడవ నిజాం) 0.3 శాతం

 

మూలం: http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2006/nov/13main60

ప్రకటనలు

రిజర్వేషన్లు

రిజర్వేషన్ల ముఖ్యోద్దేశ్యం వెనుక బడిన వర్గాలవారిని ముందుకు తీసుకురావడమయినా,  అది ఎలా సాదిస్తారు అనే విషయం ఆలోచిస్తే ఈ క్రింది రెండు విధాలు కనిపిస్తాయి.

అ. రిజర్వేషన్ల వల్ల ఆయా వర్గాలలోని వారికి విధ్య, ఉద్యోగాలలో చాలా సులభంగా అవకాశాలు లభిస్తాయి. దీని వల్ల ఆ వర్గాలవారు చదువుల మీద ఆసక్తిని పెంచుకుని, విధ్యావంతులై ,ఉద్యోగస్తులై అభివృద్ది చెందుతారు.

ఆ. అదేవిదంగా ఆయావర్గాలలోని కొందరు, ఉన్నత స్థానాలను అదిరోహించి మిగతా వారికి ప్రేరణ కల్గిస్తారు. దీని వల్ల మిగతావారిలో కూడా గొప్పవారు కావాలనే కోరిక పెరిగి వారుకూడా అభివృద్ది చెందుతారు.

ఈ రెండు విధాలు ఎంతవరకు పనిచేస్తున్నాయో చూద్దాం.

ముందుగా మొదటి విధానికి వస్తే, చాలా ప్రభుత్వ పాఠశాలలలో ప్రాధమిక విధ్య సరిగా లేకపోవడం వల్ల వెనుక బడిన వర్గాల వారిలో నిజంగా వెనుకబడ్డవాళ్ళు ప్రాధమిక దశదాటి పైకి రాలేక పోతున్నారు. అందువల్లవారికి రిజర్వేషన్ల వల్ల ఉపయోగం లేకుండా పోతుంది. కనుక ఈ రిజర్వేషన్లు అనేవి కేవలం ఆయా వర్గాలలలోని ఉన్నతాదాయులకు మాత్రమే ఉపయోగ పడుతున్నాయి.

ఇక రెండో విధానికి వస్తే, వెనుక బడిన వర్గాల వారిలో కొందరు నిజంగానే మిగతావారికి ప్రేరణ కల్గించేంత గొప్పవారు అవుతున్నప్పటికీ కేవలం ప్రేరణ కల్గించడం పెద్దగా ఉపయోగం ఉండదు. ప్రేరణతో పాటు వారినుండి మిగతావారికి కొంత సహాయం (ధన సహాయంకానివ్వండి లేదా వారికి సలహాలు ఇచ్చి కనీసం దిశా నిర్ధేశం చెయ్యడం కానివ్వండి) ఎంతో అవసరం. కానీ ఒకే వర్గం అనే భావన ఓట్లకోసం లేదా వేరే వర్గంవారితో గొడవలకు తప్ప మరేవిధంగానయినా ఉపయోగ పడుతుందా అనేది చర్చనీయాంశం.

నా ఉద్దేశ్యం ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం కంటే ముందు సరైన ప్రాధమిక విధ్యా సౌకర్యాలు కల్పించి తరువాత ఉన్నత విధ్యకు ఆయా వర్గాలలోని(వీలయితే అన్ని వర్గాలలోని) పేదవారికి ఆర్ధిక సహాయం అందించడం ఉత్తమం. ప్రాధమిక విధ్య సరిగాలేక పోయినట్లయితే తరువాత రిజర్వేషన్ల ద్వారా ఉన్నత విధ్య అభ్యసించగల్గినప్పటికీ ఆ చదువులు పూర్తి చెయ్యలేక లేదా మిగతా వారితో సమానంగా మార్కులు సాధించలేక, వారంటే వారికే తక్కువభావమేర్పడి ఎప్పటికీ వెనుకబడే ఉండే ప్రమాదం ఉంది.

ఇంకా ఆయా వర్గాలలో ఉన్నత స్థితికి చేరినవారు కేవలం వారికి మాత్రమే ప్రయోజనం కల్గించే రిజర్వేషన్ల కోసం పోరాడడం మానేసి, మిగతావారికి సహాయం చేసి వారిని పైకి తీసుకురావడం ఎలా అని ఆలోచిస్తే, కొన్నిరోజుల్లో వెనుకబడ్డ వర్గాలు అనే పేరుకూడా మాయమవ్వడం ఖాయం.