మైక్రోసాఫ్టు సర్ఫేస్..

మనం కంప్యూటరు వాడే విధానాన్ని పూర్తిగా మార్చేయడానికి మైక్రోసాఫ్టు విడుదల చేసిన ఈ క్రొత్త రకం కంప్యూటరును చూడండి. టేబులులా ఉండే ఈ కంప్యూటరులో మనం వస్తువులను చేత్తో జరిపినట్లుగా, కంప్యూటరులోని ఫోటోలు మొదలయినవాటిని కూడా చేత్తో అటూ, ఇటూ జరిపేయవచ్చు. ఇంతే కాక దీనిని మొబైలు ఉపకరణాలతో అనుసంధానం చేయడం కూడా చాలా సులభం. మైక్రోసాఫ్టు సర్ఫేసు అని నామకరణం చేసిన ఈకంప్యూటరును, ఈసంవత్సరాంతానికి హోటల్లు, కాసినోలు, రెస్టారెంట్లవంటి వాటికి అందుబాటులోకి తేనున్నది. అయితే, మొదట్లో దీని ధర దాదాపు 5-10 వేల డాలర్లు(రూ. 2 – 4 లక్షలు) ఉన్నప్పటికీ, ఇంకో 3-5 సంవత్సరాలలో సాదారణ ప్రజాణీకానికి అందుబాటు ధరలలో లభించవచ్చు.

 మరిన్ని వివరాలకు..  http://www.microsoft.com/surface/ చూడండి.

ప్రకటనలు

మొబైలులో తెలుగు వెలుగులు

ఇప్పుడు మీరు మైక్రోసాఫ్టు డీప్‌ఫిష్ సహాయంతో విండోసు మొబైలులోకూడా తెలుగును చక్కగా చూడవచ్చు. ఉదాహరణకు ఇక్కడ కొన్ని తెరచాపలను ఉంచాను. మరిన్ని వివరాలకు ఈ క్రింది లంకెను అనుసరించండి.

డీప్‌ఫిష్ అంటే ఏమిటి?

మరో అమ్మాయి

రావుగారు మాట్లాడే అమ్మాయిని మీకు చూపించారు కదా? ఇప్పుడు ఇంటర్నెట్టులో మీకు కావలసినది వెదికి పెట్టే ఈవిడని చూడండి.

బ్లాగు 2007

ఇప్పుడు మీరు మైక్రోసాఫ్టు ఆఫీసు 2007 నుండి నేరుగా బ్లాగించవచ్చు. మీ దగ్గర ఆఫీసు వర్డు 2007 ఉన్నట్లయితే, ఈ క్రింది సోపానాలు పాటించండి చాలు. 
  
 
 
  
  
 
 
  
  
 
  
 
 
  
 
  
 
 


 
 

మా ఊరు వద్దామనుకుంటున్నారా..

అయితే ఇదిగో లోకల్ లైవ్ లోని ఈ లంకెను అనుసరించండి.

http://local.live.com లో మనదేశంలోని ఏ రెండు ప్రదేశాల మద్య దారినయినా తెలుసుకోవచ్చు. మీరు చెయ్యవలసినదల్లా ఆ సైటుకు వెళ్లి, “Driving Directions” ని క్లిక్కండి. తరువాత మీరు ఎక్కడనుండి ఎక్కడకు వెళ్ళాలనుకుంటున్నారో దానిలో టైపు చెయ్యండి. అంతే మీరు వెళ్ళాల్సినదారి ప్రత్యక్షం.

ఫైరుపాక్షు కు ఐ.ఇ (IE) కేకు…

కేకు.

దీన్ని గురించి బ్లాగు ఇక్కడ http://fredericiana.com/2006/10/24/from-redmond-with-love/

అలానే ఆపిల్ 30 ఏళ్ళు పూర్తిచేసుకొన్నప్పుడు మైక్రోసాఫ్టు పంపిన గ్రీటింగు కార్డు కూడా చూడండి.

అపిల్