పుస్తకాల పురుగు..

మిమ్మల్ని పుస్తకాల పురుగు కుట్టింది!

ఈ పురుగు కుడితే మీరు వెంటనే చేయవలసిన వైద్యం: మీరు చదివిన ఏదో ఒక పుస్తకం గురించి మీ బ్లాగులో తెలుగులో రాయాలి. రాసారా సరే సరి, లేదో.. కాయతొలుచు పురుగు, వేరు తొలుచు పురుగుల్లాగా ఇది మెదడు తొలుచు పురుగై ఓ రాత్రివేళ మీ మెదడును తొలిచేస్తుంది.., మీ ఇష్టం!

అంచేత, వెంటనే ఏదైనా పుస్తకం గురించి రాసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.

తెలుగువారిచేత చక్కటి తెలుగు పుస్తకాలు చదివించడమే కాక వాటి గురించి చక్కటి బ్లాగులు రాయించే సదాశయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలుగు బ్లాగుల ప్రపంచ వేదిక. మీరూ దీనిలో పాలుపంచుకోండి. చక్కటి తెలుగు పుస్తకాలు చదవండి. ఆపై ఆ పుస్తకం గురించి తేటతెలుగులో రాయండి, మిగతావారిచే చదివించండి. నేను మిమ్మల్ని కుట్టిస్తున్నాను. మీరో ఇద్దర్ని కుట్టించండి.
{చదువరిగారి బ్లాగునుండి నకలు చేసి పేర్చబడినది}


నేను పెద్దగా పుస్తకాలు చదివే వాడిని కాకపోయినా నామీదకు పుస్తకాల పురుగును వదలి నాచేత పుస్తకాలు చదివిద్దామని చదువరిగారు నిశ్ఛయించుకున్నట్లున్నారు. కానీ నేనిప్పుడు చదవడం మెదలు పెడితే, ఆ పుస్తకం పూర్తయ్యేలోపు ఈ పుస్తకాల పురుగులు, నా మెదడుని, నా శరీరాన్నేకాక నేను చదివే పుస్తకాన్ని కూడా తినేస్తాయి కాబట్టి, ప్రస్తుతానికి నేను ఇంతకు ముందు చదివిన పుస్తకాలను గురించి వ్రాస్తాను.

  1. జీవన తరంగాలు. యద్దనపూడి సులోచనారాణి గారు వ్రాసిన ఈ నవలను నేను దాదాపు సంవత్సరంన్నర కిందట చదివాను. చాలా బాగుంది. ఇది సినిమాగా కూడా తీసినట్లున్నారు.
  2. అంతర్ముఖం. ఇది యండమూరి వీరేంధ్రనాద్ గారు వ్రాసిన నవల. పర్వాలేదు. కాని ఇది వేదాంతం మరియు విషాదం కలసి ఉన్న నవల. అందువలన ఇలాంటి వాటిని తట్టుకోలేనివారు దీని జోలికి వెళ్ళవద్దని మనవి.

ఇంకా ఏమైనా గుర్తొస్తే మళ్ళీ పుస్తకాల పురుగు కుట్టినప్పుడు వ్రాస్తాను.

ప్రకటనలు