ఐ.ఐ.టి – ఐ.టి.ఐ

గిరి గారు వ్రాసిన A bolt from the blue అనే టపా చూశాక నాకు ఇది గుర్తొచ్చింది.

మా మిత్రుడొకరికి, ఐ.ఐ.టి బాంబే లో సీటు వచ్చింది. బాంబే వెళ్లబోయే ముందు బట్టలు కుట్టించుకోడానికి వాళ్ల ఇంటి దగ్గరున్న టైలరుకు దగ్గరకు వెళ్లాడు. అప్పుడు వారి మద్య జరిగిన సంభాషణ ఇది.

టైలరు: చదువుకోడానికి బొంబాయి వెళ్తున్నావటగా?

మిత్రుడు: అవును ఐ.ఐ.టి బొంబాయిలో సీటొచ్చింది.

టైలరు: ఇంకొంచం కష్టపడి చదివితే గుంటూరు డాన్ బాస్కో ఐ.టి.ఐ లోనే సీటొచ్చేది కదా. మీవాళ్లు నిన్నంత కష్టపడి చదివిస్తోంటే నువ్వామాత్రమైనా చదవకపోవడం ఏం బాగాలేదు.

అంతే మావాడు తరువాత ఇంకెప్పుడు ఆ టైలరు దగ్గరకు వెళ్లలేదు 🙂

ప్రకటనలు

వాసిరెడ్డి రంజిత్

ఈరోజు (మే 7) మితృడు, ఒక గొప్ప విధ్యార్ధి అయిన వాసిరెడ్డి రంజిత్ 25వ జన్మదినం. చిన్నవయసులోనే ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన రంజిత్ గత సంవత్సరం జులై 10న ఈత కొలనులో ప్రమాదవశాత్తు మునిగి, తనువు చాలించాడు. అతని సి.వి.లో 1981 మే 7 జన్మదినం అని ఉన్నా నిజానికి అతను 1982 లోజన్మించాడు. ఒక మంచి ఫ్రొఫెసరు అవుతాడనుకున్న రంజిత్, 25 సంవత్సరాలు కూడా నిండకుండానే మనల్ని వీడి వెళ్లిపోవడం భాదాకరమైన విషయం. రంజిత్ ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటూ…

రిజర్వేషన్లు

రిజర్వేషన్ల ముఖ్యోద్దేశ్యం వెనుక బడిన వర్గాలవారిని ముందుకు తీసుకురావడమయినా,  అది ఎలా సాదిస్తారు అనే విషయం ఆలోచిస్తే ఈ క్రింది రెండు విధాలు కనిపిస్తాయి.

అ. రిజర్వేషన్ల వల్ల ఆయా వర్గాలలోని వారికి విధ్య, ఉద్యోగాలలో చాలా సులభంగా అవకాశాలు లభిస్తాయి. దీని వల్ల ఆ వర్గాలవారు చదువుల మీద ఆసక్తిని పెంచుకుని, విధ్యావంతులై ,ఉద్యోగస్తులై అభివృద్ది చెందుతారు.

ఆ. అదేవిదంగా ఆయావర్గాలలోని కొందరు, ఉన్నత స్థానాలను అదిరోహించి మిగతా వారికి ప్రేరణ కల్గిస్తారు. దీని వల్ల మిగతావారిలో కూడా గొప్పవారు కావాలనే కోరిక పెరిగి వారుకూడా అభివృద్ది చెందుతారు.

ఈ రెండు విధాలు ఎంతవరకు పనిచేస్తున్నాయో చూద్దాం.

ముందుగా మొదటి విధానికి వస్తే, చాలా ప్రభుత్వ పాఠశాలలలో ప్రాధమిక విధ్య సరిగా లేకపోవడం వల్ల వెనుక బడిన వర్గాల వారిలో నిజంగా వెనుకబడ్డవాళ్ళు ప్రాధమిక దశదాటి పైకి రాలేక పోతున్నారు. అందువల్లవారికి రిజర్వేషన్ల వల్ల ఉపయోగం లేకుండా పోతుంది. కనుక ఈ రిజర్వేషన్లు అనేవి కేవలం ఆయా వర్గాలలలోని ఉన్నతాదాయులకు మాత్రమే ఉపయోగ పడుతున్నాయి.

ఇక రెండో విధానికి వస్తే, వెనుక బడిన వర్గాల వారిలో కొందరు నిజంగానే మిగతావారికి ప్రేరణ కల్గించేంత గొప్పవారు అవుతున్నప్పటికీ కేవలం ప్రేరణ కల్గించడం పెద్దగా ఉపయోగం ఉండదు. ప్రేరణతో పాటు వారినుండి మిగతావారికి కొంత సహాయం (ధన సహాయంకానివ్వండి లేదా వారికి సలహాలు ఇచ్చి కనీసం దిశా నిర్ధేశం చెయ్యడం కానివ్వండి) ఎంతో అవసరం. కానీ ఒకే వర్గం అనే భావన ఓట్లకోసం లేదా వేరే వర్గంవారితో గొడవలకు తప్ప మరేవిధంగానయినా ఉపయోగ పడుతుందా అనేది చర్చనీయాంశం.

నా ఉద్దేశ్యం ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం కంటే ముందు సరైన ప్రాధమిక విధ్యా సౌకర్యాలు కల్పించి తరువాత ఉన్నత విధ్యకు ఆయా వర్గాలలోని(వీలయితే అన్ని వర్గాలలోని) పేదవారికి ఆర్ధిక సహాయం అందించడం ఉత్తమం. ప్రాధమిక విధ్య సరిగాలేక పోయినట్లయితే తరువాత రిజర్వేషన్ల ద్వారా ఉన్నత విధ్య అభ్యసించగల్గినప్పటికీ ఆ చదువులు పూర్తి చెయ్యలేక లేదా మిగతా వారితో సమానంగా మార్కులు సాధించలేక, వారంటే వారికే తక్కువభావమేర్పడి ఎప్పటికీ వెనుకబడే ఉండే ప్రమాదం ఉంది.

ఇంకా ఆయా వర్గాలలో ఉన్నత స్థితికి చేరినవారు కేవలం వారికి మాత్రమే ప్రయోజనం కల్గించే రిజర్వేషన్ల కోసం పోరాడడం మానేసి, మిగతావారికి సహాయం చేసి వారిని పైకి తీసుకురావడం ఎలా అని ఆలోచిస్తే, కొన్నిరోజుల్లో వెనుకబడ్డ వర్గాలు అనే పేరుకూడా మాయమవ్వడం ఖాయం.