ఐ.ఐ.టి – ఐ.టి.ఐ

గిరి గారు వ్రాసిన A bolt from the blue అనే టపా చూశాక నాకు ఇది గుర్తొచ్చింది.

మా మిత్రుడొకరికి, ఐ.ఐ.టి బాంబే లో సీటు వచ్చింది. బాంబే వెళ్లబోయే ముందు బట్టలు కుట్టించుకోడానికి వాళ్ల ఇంటి దగ్గరున్న టైలరుకు దగ్గరకు వెళ్లాడు. అప్పుడు వారి మద్య జరిగిన సంభాషణ ఇది.

టైలరు: చదువుకోడానికి బొంబాయి వెళ్తున్నావటగా?

మిత్రుడు: అవును ఐ.ఐ.టి బొంబాయిలో సీటొచ్చింది.

టైలరు: ఇంకొంచం కష్టపడి చదివితే గుంటూరు డాన్ బాస్కో ఐ.టి.ఐ లోనే సీటొచ్చేది కదా. మీవాళ్లు నిన్నంత కష్టపడి చదివిస్తోంటే నువ్వామాత్రమైనా చదవకపోవడం ఏం బాగాలేదు.

అంతే మావాడు తరువాత ఇంకెప్పుడు ఆ టైలరు దగ్గరకు వెళ్లలేదు 🙂

ప్రకటనలు

20 వ్యాఖ్యలు

 1. ఇది జోకు లేక భాద లేక అజ్ఞానం చూపించడమా? మీ ఉద్దేశం అర్థం కాలేదు.

 2. ఇది ఒక జరిగిన సంఘటన, నాకు జోకులా అనిపిస్తే వ్రాసాను. మీకెలా అనిపిస్తే అలా అనుకోండి, దాని వల్ల నష్టమేమిలేదు.

 3. హహహ… అంతే కదా మరి 🙂

 4. iit కి iti కి, iim కి imm కి ఇలా తికమక పడే వాళ్ళు చాలమందే ఉంటారు…అప్పుడప్పుడు ఈ తికమకలు హాస్యాస్పద సంఘటనలకి దారి తీస్తుంటాయి 🙂

 5. జోకు బావుంది. టైలరుదగ్గరికి వెళ్లడం మానెయక్కరలేదేమో. అట్లా చిన్నవాటికి మానేయడం మొదలెడితే, మరి టైలరులు దొరక్కపోవచ్చు :).

 6. నాకూ ఇలాంటి పరిస్థితే ఎదురయింది. నాకు డిస్టింక్షన్ వచ్చిందని నా ఫ్రెండు వాళ్ళ నాన్నకు చెబితే “అది సెకండ్ క్లాసు కన్నా తక్కువా” అన్నాడు.

  — విహారి

 7. నాకు సిస్కో సిస్టంస్ లో ఉద్యోగం వచ్చిందంటే మా ఊరి ఆయన ఒకరు సత్యంలోనో, ఇన్‌ఫోసిస్‌లోనో రాలేదా అని అడిగాడు..!!

 8. Lol Rajarao…

 9. :)) good ones!

 10. ఇలాంటి అనుభవం నాకూ ఎదురైందండీ. హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ లో అడ్మిషన్ పూర్తి చేసుకుని మా వూరు వెళ్ళే బస్సు ఎక్కాను. పక్క సీటులో కూర్చున్నాయన మాట కలిపాడు. ఏమి చదువుతున్నావు? ఎక్కడ ? మొ. విషయాలు అడిగాడు. నా సమాధానాలన్నీ ఆలకించి “అంతేలే నాయనా రేయింబవళ్ళూ కష్టపడి చదివే ఓపికెందరికుంటుందీ. మా పిలగాడు అలా చదివాడు కనుకనే ఉప్పల్ కాలేజీలో సీటు వచ్చింది. నివ్వు కూడా ఇంకొంచెం కష్టపడుంటే ఉస్మానియాలో కాకపోయినా కనీసం కాకతీయలోనైనా ఏదోక కాలేజీ దొరికేదికదా” అంటు చిన్న క్లాసు పీకాడు. ఆయన వాగ్ధటి చూసి ఏమి చెప్పాలో అర్ధం కాక మౌనంగా ఉండిపోయాను. ఈ విషయం తిరిగొచ్చాక మా ఫ్రెండ్‌కి చెప్తే చూశావా ఇక్కడి వారికి ఇక్కడి వనరుల గురించి తెలియనివ్వడం లేదంటూ మరో పాయింటు లేవదీశాడు. అది వేరే సంగతనుకోండి.

 11. ఈ ఐఐటీ ఐటీఐ లకు సంబంధించి ఓ జోకుంది.. సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నీకు ఓ ఐఐటీ కావాలా యాభై ఐటీఐలు కావాలా అని అడిగిందట కేంద్రం. నాకు యాభై ఐటీఐలే కావాలన్నాడట.

  (ఒకటి కంటే యాభై ఎక్కువని అన్నాడో లేక ముందు చూపుతోటి అన్నాడో తెలీదు గానీ రాష్ట్ర ప్రజలకు ఎక్కువ మందికి ఉపయోగపడాలంటే ఒక్క ఐఐటీ కంటే యాభై ఐటీఐలే ఎక్కువ ప్రయోజనకరమనుకుంటా!)

 12. కామెంట్లు వ్రాసినందరికీ నెనర్లు.

  చదువరి గారు,
  ఆ జోకు ఎంత వరకు నిజమో నాకనుమానమే. ఐ.టి.ఐ కాలేజి ఏర్పాటు చేయడం రాష్ట్రం చేతుల్లో పనికదా, దానికి కేంద్రంతో పనేముంది.

 13. ఔనౌను! ఇదెంత వరకు నిజమో నాకూ అనుమానమే లెండి!:)

 14. మీ తలకట్టు అక్షరాలు చాలా బావున్నై.

 15. మచిలీపట్నం లో మలికిపట్నం ప్రాంతం లో ఒక పెళ్ళి,ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ఒక ముప్ఫై మంది దాకా వెళ్ళాం.పెళ్ళికీ భోజనాలకు మధ్య కొందరు పెద్దలతో మాటలౌ కలిశాయి.మా గుంపులో అప్పటికే ఒకతను సివిల్స్ కు సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ ఆర్డర్ల కోసం ఎదురు చూస్తున్నాడు.ఆ మాటే చెప్పి సివిల్స్ కు వెళ్తున్నానూ అన్నాడు.ఒకామె పాపం బియ్యీడీ సీటు రాలేదా బాబూ ఎంత సానుభూతి చూపిందో ఇంకా బాగా గుర్తొస్తుంది ఇద చదివాక.

 16. hav look @
  http://muralidharnamala.wordpress.com/

 17. bagunnai coments

 18. వెంకట్రమణ గారూ నన్ను గుర్తు పట్టారా? అదేనండీ అప్పుడెప్పుడో…….. వదిలేయండి…..మీరు ఫుల్ ఆఫ్ సాంకేతికమనుకున్నా,ఏదో అడుగుదామని వచ్చి మీ జోకులు చూసి అదేంటో మరిచా. నా బ్లాగుకు మీరసలు వచ్చినట్లు లేదు ఒక సారి రండి. సరదాగా నవ్వించే టాలెంటుందని యిప్పుడే తెలిసింది.ఎవ్వరినీ నొప్పించని,కించపరచని జోకులంటే నాకెంతో యిష్టం. అదేంటో గాని నాకు జోకులెయ్యడం అస్సల్ రాదు…నేర్చుకోవచ్చా? నేర్పుతారా? యిప్పటికీ మిమ్మల్ని నేనేమడగాలనుకున్నానో గుర్తు రాలా.అయినా మీకిన్ని కామెట్లా వస్తున్నాయండి బాబు? వీళ్ళెవరూ
  నా బ్లాగుకు ఎందుకు రారో అర్ధం కాలా. ఆ గుర్తొచ్చింది .బ్లాగుకు విజిటర్లను ఎలా ఆకట్టుకోవాలి? మీరైనా సరే, యింకెవరైనా సరే. కీపిటప్.అభినందనలు. శ్రేయోభిలాషి, …నూతక్కి

  • గుర్తున్నారండి. నేను ఈ మద్య బ్లాగుల్లో ఏమి వ్రాయడంలేదండి. కాకపోతే బ్లాగు అలా పడి ఉండటం వల్ల మీలా దారినపోయే వారంతా తలా ఒక కామెంటు పడేసి పోతుంటారు, నా బ్లాగుకు కామెంట్లు రావడాని ఇంతకంటే కారణమేమి నాకు కనిపించలేదు :).

 19. ఇలాంటి సంఘటనలు ప్రతివారికి చాలా జరుగుతూనే వుంటాయి, కాని ఇలా పంచుకుంటుంటే చాలా బాగుంటుంది, ఇలాగా ఏదైనా రాద్దామంటే నాకు ఒక్కటి కూడా గుర్తు రావడం లేదు,

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: