మానవత్వం పరిమళిస్తోందా…

అవుననే అనిపిస్తుంది ఈమద్య జరిగిన రెండు సంఘటనలను చూస్తే..

1. అది మా కంపనీలోని తెలుగువారి మెయిలింగు లిష్టు. బజాకం అవడం వల్ల ఇండియాలోని వారు, అమెరికాలోని వారు కూడా ఉంటారు. అయితే, సాదారణంగా దీనికి రోజుకు రెండు మూడు కంటే ఎక్కువ ఉత్తరాలు రావు. అవి కూడా వారికి అమెరికా నుండి ఇండియాకు లేదా ఇండియానుండి అయెరికాకు ప్రయాణంలో తోడుకావాలి, ఎవరైనా ఉన్నారా అని. అయితే, ఒక రోజు పొద్దున ఆఫీసుకు వెళ్లిన నేను ఆ లిష్టులో 120 పైనే మెయిల్లండటం చూసి ఆశ్చర్యపోయాను. విషయమేమిటా అని చూస్తే ఆరోజు ఎవరో ఒకతను(మాకంపనీలో పనిచేసే అతను కాదు) దురదృష్టవశాత్తు గుండెపోటుతో మరణించడం జరిగినది. అతని మృతదేహాన్ని ఇండియాకు తరలించడానికి ఆర్ధిక సహాయం చేయాలని ఒక ఉత్తరం ఉంది. దానికి సమాధానంగా, అందరూ డబ్బు ఎవరికి ఇవ్వాలి ఏమిటి అనేవిషయాన్ని కనుక్కోడానికి మెయిల్లు చేయడమే కాక, కొద్ది గంటల వ్యవదిలోనే చాలా మొత్తాన్ని అందించారు. అయితే, వారి కుటుంబం అంత్యక్రియలను అక్కడే నిర్వహించాలని నిర్ణయించుకోవడంతో, ఆ సేకరించిన డబ్బును మరణించినతని కుటుంబానికి అందివ్వాలని నిర్ణయించారు.

2. అదే కంపనీలోని, కొన్నివిద్యాసంస్థల పూర్వ విద్యార్థుల మెయిలింగు లిష్టు. ఈసారి మెయిల్లో ఎవరో ఒక వార్తా పత్రికనుండి పంపించిన కథనం ఉంది. దాని ప్రకారం బీహారులోని ఒక విద్యార్ధినికి ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు వచ్చినా ఆర్ధిక స్థోమత లేక ఆ విద్యాసంస్ధలో చేరలేక పోయింది. అయితే అందులో ఆమె చిరునామాగాని, మరే ఇతర వివరాలు గాని లేవు. అది చూసిన వెంటనే కొందరు సహాయం చేయడానికి ముందుకొచ్చి, ఆ పత్రికా కార్యాలయానికి ఫోను చేసి, ఆ వార్తను వ్రాసిన విలేఖరి వివరాలు కనుక్కొని, అతని ద్వారా ఆమె వివరాలు తెలుసుకొని మిగతా వారందరికీ అందించారు.

ఇవి రెండు సంఘటనలను చూసిన తరువాత, మనలో మానవత్వంకలవారే కాక, సకాలంలో సహాయం అందించాలనే ఆతృత గలవారు చాలా మందే ఉన్నారని నాకనిపిస్తుంది.

ప్రకటనలు

18 వ్యాఖ్యలు

 1. “మనలో మానవత్వంకలవారే కాక, సకాలంలో సహాయం అందించాలనే ఆతృత గలవారు చాలా మందే ఉన్నారని నాకనిపిస్తుంది.”..అంత
  ఆశ్చర్యానికి దారితీసిన మీ అనుభవాలేమిటో?

 2. ఈ మధ్య సంపాదన పెంచుకోవాలనే కాక అంతో ఇంతో ఎదుటివారికి సాయపడాలనే తపన యువత లో ఎక్కువగానే కనిపిస్తుంది.చిన్న వయసులోనే ఎక్కువ సంపాదన వస్తుండడం ,పెళ్ళి,బాధ్యతలు అనేవి ఇంకా చుట్టుకోక ముందే స్తిర పడడం వల్ల ఏదో మనకొచ్చేదానిలో పది రూపాయలు ఇస్తే మనదేమి పోతుందిలే అని అనుకొనేవారు పెరగడం …..అన్ని మంచి పరిణామాలే.

 3. వెంకట రమణ గారూ,

  అధిక ఆదాయాలు ఇవ్వలేని తృప్తిని ఇలాంటి మంచి పనులు ఇస్తాయని గ్రహించగలిగిన వారు ఇలా మానవత్వానికి ప్రతిరూపాలుగా నిలుస్తున్నారు.

  -నల్లమోతు శ్రీధర్

 4. నెటిజను గారు,

  నా ఆశ్చర్యానికి కారణం, నేను ఈ పోష్టులో వ్రాసివ రెండ సంఘటనలే ముఖ్యమైనవండి. వాటితో పాటుగా, ఈమద్య కాలంలో ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు గమనిస్తూనే ఉన్నాను.

 5. AB+ గ్రూప్ రక్తం కావాలని తెలిసి పరిగెత్తుకుంటు ఆ చిన్నారి ఒపెన్ హేర్త్ సర్జెరి చేస్తున్న హాస్పిటల్ కి వచ్చాదు, తన ఖర్చుతొ.

  పేద్దాయన నిలబడి ఉండటం చూసి, దిగబొయ్యేముందు కూర్చోండి అని చెప్పడం కాదు.

  ముసలమ్మని రోడ్డు దాటించడం. ఇవ్వన్ని అప్పటికప్పుడు వారికి అవసరమైనప్పుడు చేసే పనుల్లే కదా?

  చదువుకు డబ్బులు లేవంటే ఫీజులు కత్తేఅ వారిని, పుస్తకాలుకొనిచ్చినవారిని చూసేవుంటారు.

  ఈ పనులన్ని, ఊపిరి పీలుస్తున్నంత సాధారణంగా చేయ్యరా?
  ఇంక ఇందులో ఆశ్చర్యం ఏముంది ?

 6. మీరు చెప్పినవన్నీ నిజమే, కాని నేను ఇంతకు ముందెప్పుడూ అలాంటి విషయాలను ఎక్కువగా గమనించే అవకాశం రాలేదు. ఈమద్య ఇలాంటివి చాలా చూడటంతో ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది.

 7. ఆనందం.
  మీరు అది గమనించడం ప్రారంభించినందుకు “సంతోషం”.
  గమనించడంతో ఆగిపోరని..అవసరమైనప్పుడు, అవకాశాన్ని బట్టి మీరు కూడా ఒక చెయ్యివేస్తారని ఆశిస్తు..

 8. mee blog chudatam chala kastamga vundandi
  click chestae kadilipotundi

 9. క్లిక్ చేస్తే కదిలిపోవడమేమిటండి, కొంచం వివరంగా చెప్తారా..

 10. adi scroll chestuntae problem ga vundandi.
  piki , kindaki velipotundi.
  page meeda mouse to click chaestuntae page reload avutundi

 11. నా కంప్యూటరులో అలా ఏమి జరగడం లేదండి. మీ బ్రౌజరులో ఎమైనా సమస్య ఉండి ఉండొచ్చు.

 12. పొరబాటున మీరు పంపిన లింకు, మీ వాఖ్య తొలగిపొయినవి. దయచేసి మళ్ళీ పంపించండి. క్షమించండి. మీరు పంపారనే ఉద్దేశ్యంతో ఇక్కడ ఈ వాఖ్య!

 13. విహారి గారు చెప్పింది నిజమేనండి వెంకటరమణ గారు.. మీ సైట్ చాలా నెమ్మదిగా ఉంది… క్లిక్ చేస్తే రీలోడ్ ఏమి జరగడం (నా సిస్టమ్ లో) లేదుగానీ, చాలా స్లోగా మాత్రం ఉంది.. గమనించగలరు..మీ సైట్ లో నేను గమనించింది ఏమిటంటే… http://spa.snap.com నుండి ఏదో డౌన్ లోడ్ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.. కానీ పూర్తి అవ్వటంలేదు… ఒక ఎర్రర్ సింబల్ కూడా వస్తోంది,కింద స్టేటస్ బార్ లో…!

 14. విహారిగారు, నంద గారు,

  ఇప్పుడొకసారి చూడండి. ఆ snap plugin అచేతనం చేశాను.

 15. Your blog is very hard to read because I cannot adjust the font size to be larger. I have googled for a solution on how to increase the font size (in Internet Explorer, already tried the View–>Text Size–>Largest option).

  Any suggestions? Thank you

 16. There is warmth in every person. But everyone has their own limitations and hesitations so they do not come forward. But certain incidents move people very much and so they will help.

  As Netijen opined we have to invigorate that spirit and try to help others in our own way.

 17. అవును. చాలా మంచి టపా అందించారు.

 18. నా మనసుతొ నేను. నీవు లేని ఈ ప్రపంచం శూన్యం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: