మానవత్వం పరిమళిస్తోందా…

అవుననే అనిపిస్తుంది ఈమద్య జరిగిన రెండు సంఘటనలను చూస్తే..

1. అది మా కంపనీలోని తెలుగువారి మెయిలింగు లిష్టు. బజాకం అవడం వల్ల ఇండియాలోని వారు, అమెరికాలోని వారు కూడా ఉంటారు. అయితే, సాదారణంగా దీనికి రోజుకు రెండు మూడు కంటే ఎక్కువ ఉత్తరాలు రావు. అవి కూడా వారికి అమెరికా నుండి ఇండియాకు లేదా ఇండియానుండి అయెరికాకు ప్రయాణంలో తోడుకావాలి, ఎవరైనా ఉన్నారా అని. అయితే, ఒక రోజు పొద్దున ఆఫీసుకు వెళ్లిన నేను ఆ లిష్టులో 120 పైనే మెయిల్లండటం చూసి ఆశ్చర్యపోయాను. విషయమేమిటా అని చూస్తే ఆరోజు ఎవరో ఒకతను(మాకంపనీలో పనిచేసే అతను కాదు) దురదృష్టవశాత్తు గుండెపోటుతో మరణించడం జరిగినది. అతని మృతదేహాన్ని ఇండియాకు తరలించడానికి ఆర్ధిక సహాయం చేయాలని ఒక ఉత్తరం ఉంది. దానికి సమాధానంగా, అందరూ డబ్బు ఎవరికి ఇవ్వాలి ఏమిటి అనేవిషయాన్ని కనుక్కోడానికి మెయిల్లు చేయడమే కాక, కొద్ది గంటల వ్యవదిలోనే చాలా మొత్తాన్ని అందించారు. అయితే, వారి కుటుంబం అంత్యక్రియలను అక్కడే నిర్వహించాలని నిర్ణయించుకోవడంతో, ఆ సేకరించిన డబ్బును మరణించినతని కుటుంబానికి అందివ్వాలని నిర్ణయించారు.

2. అదే కంపనీలోని, కొన్నివిద్యాసంస్థల పూర్వ విద్యార్థుల మెయిలింగు లిష్టు. ఈసారి మెయిల్లో ఎవరో ఒక వార్తా పత్రికనుండి పంపించిన కథనం ఉంది. దాని ప్రకారం బీహారులోని ఒక విద్యార్ధినికి ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు వచ్చినా ఆర్ధిక స్థోమత లేక ఆ విద్యాసంస్ధలో చేరలేక పోయింది. అయితే అందులో ఆమె చిరునామాగాని, మరే ఇతర వివరాలు గాని లేవు. అది చూసిన వెంటనే కొందరు సహాయం చేయడానికి ముందుకొచ్చి, ఆ పత్రికా కార్యాలయానికి ఫోను చేసి, ఆ వార్తను వ్రాసిన విలేఖరి వివరాలు కనుక్కొని, అతని ద్వారా ఆమె వివరాలు తెలుసుకొని మిగతా వారందరికీ అందించారు.

ఇవి రెండు సంఘటనలను చూసిన తరువాత, మనలో మానవత్వంకలవారే కాక, సకాలంలో సహాయం అందించాలనే ఆతృత గలవారు చాలా మందే ఉన్నారని నాకనిపిస్తుంది.

ప్రకటనలు