మైక్రోసాఫ్టు సర్ఫేస్..

మనం కంప్యూటరు వాడే విధానాన్ని పూర్తిగా మార్చేయడానికి మైక్రోసాఫ్టు విడుదల చేసిన ఈ క్రొత్త రకం కంప్యూటరును చూడండి. టేబులులా ఉండే ఈ కంప్యూటరులో మనం వస్తువులను చేత్తో జరిపినట్లుగా, కంప్యూటరులోని ఫోటోలు మొదలయినవాటిని కూడా చేత్తో అటూ, ఇటూ జరిపేయవచ్చు. ఇంతే కాక దీనిని మొబైలు ఉపకరణాలతో అనుసంధానం చేయడం కూడా చాలా సులభం. మైక్రోసాఫ్టు సర్ఫేసు అని నామకరణం చేసిన ఈకంప్యూటరును, ఈసంవత్సరాంతానికి హోటల్లు, కాసినోలు, రెస్టారెంట్లవంటి వాటికి అందుబాటులోకి తేనున్నది. అయితే, మొదట్లో దీని ధర దాదాపు 5-10 వేల డాలర్లు(రూ. 2 – 4 లక్షలు) ఉన్నప్పటికీ, ఇంకో 3-5 సంవత్సరాలలో సాదారణ ప్రజాణీకానికి అందుబాటు ధరలలో లభించవచ్చు.

 మరిన్ని వివరాలకు..  http://www.microsoft.com/surface/ చూడండి.

వాసిరెడ్డి రంజిత్

ఈరోజు (మే 7) మితృడు, ఒక గొప్ప విధ్యార్ధి అయిన వాసిరెడ్డి రంజిత్ 25వ జన్మదినం. చిన్నవయసులోనే ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన రంజిత్ గత సంవత్సరం జులై 10న ఈత కొలనులో ప్రమాదవశాత్తు మునిగి, తనువు చాలించాడు. అతని సి.వి.లో 1981 మే 7 జన్మదినం అని ఉన్నా నిజానికి అతను 1982 లోజన్మించాడు. ఒక మంచి ఫ్రొఫెసరు అవుతాడనుకున్న రంజిత్, 25 సంవత్సరాలు కూడా నిండకుండానే మనల్ని వీడి వెళ్లిపోవడం భాదాకరమైన విషయం. రంజిత్ ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటూ…