సీ.డీలు – డీ.వీ.డీలు

మోసరుబేరు కంపెనీవాడు ఈమద్య 28 రూపాయలకే సినిమా సీడీలు మరియు 34 రూపాయలకే డీవీడీలు అమ్మడం మెదలు పెట్టాడు. వీడు చేసిన ఇంకొక మంచిపని ఆన్లైలోకూడా కొనుక్కునే విధంగా ఒక సైటును రూపొందించడం. మీరు భారతదేశంలో ఏమూలనున్నా http://www.moserbaerhomevideo.com/సైటులోనికి వెళ్ళి, మీకు కావలసిన సినిమాల సీడీలు, డీవీడీలు కొనుక్కోవచ్చు. ఆ సీడీలను మీకు బట్వాడా చేయించుకోడానికి మాత్రం అధనంగా ఇంకొక 50 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అయితే, 20 కంటే ఎక్కువ సీడీలు/డీవీడీలు కొన్నవారికి మాత్రం ఉచితంగా బట్వాడా చేస్తానని చెబుతున్నాడు.

ప్రకటనలు

6 వ్యాఖ్యలు

 1. అంత సరస మైన ధరలకు ఇస్తున్న వాళ్ళను అభినందించవలసిందే.
  మంచి విషయం చెప్పారు.

  ఇంత తక్కువ ధరలకు అమ్మేస్తే ఇతర కంపెనీల వాళ్ళు ఊరుకోనిస్తారా?
  టి.సీరీస్ , సిటీ కేబుల్ అధినేతలు ఎదుర్కొన్న సవాళ్ళను ప్రతిఘటించ గలరా వీళ్ళు?

  విహారి

 2. ఇవి షాపుల్లో కూడా అమ్మితే బానే ఉంటుంది, ఈజీ గా తక్కువకి కొనుక్కోవచ్చు.

 3. నేనో రెండు డీవీడీలు కొందామని రిజిస్టరు చెయ్యబోతే, ఎందుకో అది పనిచెయ్యలేదు. అన్ని ఫీల్డులూ నింపేసాక, సబ్మిట్ చేస్తే పనేం జరగలేదు.

 4. విహారిగారు,
  మోసరుబేరువాడు సవాళ్ళను ఎదుర్కొని మనకు ఎప్పుడూ ఇలానే అమ్మగల్గాలని ఆశిద్దాం.

  ప్రవీణ్ గారు,
  షాపుల్లో కూడా అమ్ముతున్నాడండి.
  http://www.moserbaer.com/newsroom_pressreleases.asp

  చదువరిగారు,

  వాడు పాస్వర్డుకు కచ్చితంగా 6 అక్షరాలు మాత్రమే అంగీకరిస్తున్నాడండి. అంత కంటే ఎక్కువయినా తక్కువయినా ఒప్పుకొనడంలేదు. బహుశా మీ సమస్య దానివల్లనే అనుకుంటా.

 5. వీళ్ల వెబ్ సైట్ చాలా చెత్తగా వున్నది. అంతా అయోమయం. స్పెల్లింగు తప్పులు..

  వున్నవి ఒక పది సినిమాలు.

  బాగా లేకుండా ఎందుకు దింపేస్తారో ఈ సైట్లు అర్ధం కాదు. రేప్పొద్దున్న క్రెడిట్ కార్డు గీకాక ఏదో తప్పు జరిగి అసలు ఆర్డరే రాని ప్రమాదముంది.

 6. నిజమే సైటు పరమ చెత్తగా ఉంది, మీరన్నట్టు సినిమాలు కూడా ఎక్కువ లేవు. అయితే భవిష్యత్తులో సినిమాల సంఖ్యమాత్రం తప్పని సరిగా పెరుగుతుందనిపిస్తోంది, కాని సైటు విషయం ఏమి చేస్తాడో చూడాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: