నెంబర్‌ వన్‌ ఆంధ్రుడు ‘అన్న’గారే…

హైదరాబాద్‌, నవంబర్‌ 13 (ఆన్‌లైన్‌) ఆత్మగౌరవ నినాదంతో తెలుగు జాతి కీర్తిని ప్రపం చానికి చాటిన స్వర్గీయ నందమూరి తారకరామా రావు రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారనేది మరోసారి రుజువైంది. గత 50 ఏళ్లలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన ఆంధ్రుడు ఎవరనే అంశంపై సిఎన్‌ ఎన్‌- ఐబిఎన్‌ ఛానల్‌ ఆన్‌లైన్‌ పోల్‌ను నిర్వహించిం ది. ఇందులో పాల్గొన్న వారిలో అత్యధికంగా 70 శాతం మంది ఎన్టీఆర్‌కే ఆ ఘనత దక్కుతుందని తేల్చిచెప్పారు. ఎన్టీఆర్‌ను మించిన ఖ్యాతిగాంచిన తెలు గోడు లేడని అభిప్రాయపడ్డారు. నటరత్న తర్వాత తెలు గు సినీ పరిశ్రమను ఏలుతున్న మెగాస్టార్‌ చిరంజీవికి రెండోస్థానం దక్కింది. 23 శాతం మంది చిరంజీవికి ఓటే శారు. దక్షిణాది రాష్ట్రాలు స్వర్ణోత్సవా లను జరుపుకుం టున్న సందర్భంగా సిఎన్‌ఎన్‌- ఐబిఎన్‌ ఆయా రాష్ట్రాల్లో ఈ పోల్‌ను నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మిగతా అందరి ఓట్లు కలిపినా ఎన్టీఆర్‌కు వచ్చిన వాటిలో సగం కూడా లేకపోవడం… గతించి దశాబ్దకాలం గడిచినా ఆ మహానటుడు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయి లో నిలిచిపోయారనేందుకు తార్కాణం. ఎవరికి ఎంత శాతం ఓట్లు పోలయ్యాయనే వివరాలు…

 

ఎన్‌టి రామారావు 70 శాతం

చిరంజీవి 23 శాతం

సత్యసాయి బాబా 2.6 శాతం

రామలింగరాజు (సత్యం) 1.7 శాతం

సానియా మీర్జా 1.5 శాతం

మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ (ఏడవ నిజాం) 0.3 శాతం

 

మూలం: http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2006/nov/13main60

ప్రకటనలు

బ్లాగు 2007

ఇప్పుడు మీరు మైక్రోసాఫ్టు ఆఫీసు 2007 నుండి నేరుగా బ్లాగించవచ్చు. మీ దగ్గర ఆఫీసు వర్డు 2007 ఉన్నట్లయితే, ఈ క్రింది సోపానాలు పాటించండి చాలు.