రిజర్వేషన్లు

రిజర్వేషన్ల ముఖ్యోద్దేశ్యం వెనుక బడిన వర్గాలవారిని ముందుకు తీసుకురావడమయినా,  అది ఎలా సాదిస్తారు అనే విషయం ఆలోచిస్తే ఈ క్రింది రెండు విధాలు కనిపిస్తాయి.

అ. రిజర్వేషన్ల వల్ల ఆయా వర్గాలలోని వారికి విధ్య, ఉద్యోగాలలో చాలా సులభంగా అవకాశాలు లభిస్తాయి. దీని వల్ల ఆ వర్గాలవారు చదువుల మీద ఆసక్తిని పెంచుకుని, విధ్యావంతులై ,ఉద్యోగస్తులై అభివృద్ది చెందుతారు.

ఆ. అదేవిదంగా ఆయావర్గాలలోని కొందరు, ఉన్నత స్థానాలను అదిరోహించి మిగతా వారికి ప్రేరణ కల్గిస్తారు. దీని వల్ల మిగతావారిలో కూడా గొప్పవారు కావాలనే కోరిక పెరిగి వారుకూడా అభివృద్ది చెందుతారు.

ఈ రెండు విధాలు ఎంతవరకు పనిచేస్తున్నాయో చూద్దాం.

ముందుగా మొదటి విధానికి వస్తే, చాలా ప్రభుత్వ పాఠశాలలలో ప్రాధమిక విధ్య సరిగా లేకపోవడం వల్ల వెనుక బడిన వర్గాల వారిలో నిజంగా వెనుకబడ్డవాళ్ళు ప్రాధమిక దశదాటి పైకి రాలేక పోతున్నారు. అందువల్లవారికి రిజర్వేషన్ల వల్ల ఉపయోగం లేకుండా పోతుంది. కనుక ఈ రిజర్వేషన్లు అనేవి కేవలం ఆయా వర్గాలలలోని ఉన్నతాదాయులకు మాత్రమే ఉపయోగ పడుతున్నాయి.

ఇక రెండో విధానికి వస్తే, వెనుక బడిన వర్గాల వారిలో కొందరు నిజంగానే మిగతావారికి ప్రేరణ కల్గించేంత గొప్పవారు అవుతున్నప్పటికీ కేవలం ప్రేరణ కల్గించడం పెద్దగా ఉపయోగం ఉండదు. ప్రేరణతో పాటు వారినుండి మిగతావారికి కొంత సహాయం (ధన సహాయంకానివ్వండి లేదా వారికి సలహాలు ఇచ్చి కనీసం దిశా నిర్ధేశం చెయ్యడం కానివ్వండి) ఎంతో అవసరం. కానీ ఒకే వర్గం అనే భావన ఓట్లకోసం లేదా వేరే వర్గంవారితో గొడవలకు తప్ప మరేవిధంగానయినా ఉపయోగ పడుతుందా అనేది చర్చనీయాంశం.

నా ఉద్దేశ్యం ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం కంటే ముందు సరైన ప్రాధమిక విధ్యా సౌకర్యాలు కల్పించి తరువాత ఉన్నత విధ్యకు ఆయా వర్గాలలోని(వీలయితే అన్ని వర్గాలలోని) పేదవారికి ఆర్ధిక సహాయం అందించడం ఉత్తమం. ప్రాధమిక విధ్య సరిగాలేక పోయినట్లయితే తరువాత రిజర్వేషన్ల ద్వారా ఉన్నత విధ్య అభ్యసించగల్గినప్పటికీ ఆ చదువులు పూర్తి చెయ్యలేక లేదా మిగతా వారితో సమానంగా మార్కులు సాధించలేక, వారంటే వారికే తక్కువభావమేర్పడి ఎప్పటికీ వెనుకబడే ఉండే ప్రమాదం ఉంది.

ఇంకా ఆయా వర్గాలలో ఉన్నత స్థితికి చేరినవారు కేవలం వారికి మాత్రమే ప్రయోజనం కల్గించే రిజర్వేషన్ల కోసం పోరాడడం మానేసి, మిగతావారికి సహాయం చేసి వారిని పైకి తీసుకురావడం ఎలా అని ఆలోచిస్తే, కొన్నిరోజుల్లో వెనుకబడ్డ వర్గాలు అనే పేరుకూడా మాయమవ్వడం ఖాయం.

ప్రకటనలు

4 వ్యాఖ్యలు

  1. చాలా బాగా రాసారు. అసలు రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన ఉద్దేశ్యమై పూర్తిగా నీరుగారిపోయే పరిస్ధితులు, Creamy layer ని కూడా ఇందులో భాగస్తులను చేయ తలపెట్టడం వలన, దాపురిస్తున్నాయి. మరొక విషయమేమిటంటే, ఇది రాజకీయులకు ఓట్లు రాల్చే సాధనంగా ఉపయోగపడబోతోంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ధన్యవాదాలు.

  2. now reservations are useful for the survival of politicians.

  3. మా friend ఒకరికి medical లో 1800 లు rank వచ్చిది very brillint, కాని మనకు అంతకన్న ఎక్కువ సీట్లే వున్నయి, మిగతా వారు సీటులు reserve చెసుకోవడం వల్లే ఇతను mbbs చేయలేక పోయాడు ., మంచి brilliant ను మన చట్టమే పోగొట్టుకుంది, అదే వేరె దేశంలో ఐతే పౌరులందరికి ఒకే న్యాయం వుండేది,

  4. ఆంధ్రప్రదేశ్ లో బీ.సీ.గ్రూపుల వర్గీకరణ మరోసారి చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.50 శాతం కోటా పరిమితికి మించి అమలు చేయాలంటే, మండల్‌ కమిషన్‌ తీర్పు సమయంలో సర్వోన్నత న్యాయస్థానం పొందుపర్చిన నిర్ణీత ప్రమాణాలను వెనకబడిన వర్గాల కమిషన్‌ పరిగణనలోకి తీసుకోవాలని ,తాజా జనాభా గణాంకాల ఆధారంగా వాటిని పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.తమిళనాడులో 69 శాతం ,కర్ణాటకలో 73 శాతం కోటా అమల్లో ఉంది.
    42 ఏళ్ళు గడిచినా రిజర్వేషన్ల అవసరం తీరలేదు. ఇంకా ఎంత కాలం అవసరమో చెప్పలేము. ఇన్ని ఏళ్ళ కాలంలో కనీసం ఫలానా కులాలను పైకి తీసుకురాగలిగాము అని చెప్పుకోటానికి తగిన గణాంక సేకరణ ప్రభుత్వం చేయ లేదు. ఏదైనా ఒక కులం జనాభాలో 45 శాతం కుటుంబాలు తగిన ఉద్యోగాలు సాధించి, ఆర్ధికంగా బలపడితే ఆ కులాన్ని రిజర్వేషన్ల పరిధి నుండి తప్పించాలని గతంలో కొందరు మేధావులు కోరారు. ఆ ప్రకారంగా రిజర్వేషన్లు పొందే కులాల జాబితా క్రమేణా తగ్గిపోయి, కొంత కాలానికి రిజర్వేషన్లే ఉండవని వారి వాదం. అయితే ఆయా కులాల జనాభా మీద ప్రభుత్వం సమగ్రమైన సర్వేలు జరుపుతూ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.
    జనాభా ఎక్కువగా ఉండి, రాజకీయ శక్తులను భయపెట్టగలిగే కులాలు ఈ రిజర్వేషన్ల వల్ల ఎక్కువగా లాభపడుతూ ఉండగా, జనాభా తక్కువగా ఉండి, రాజకీయ నాయకత్వమే లేని కులాలు నష్టపోతున్నాయి. అందువలన శక్తివంతమైన కులాలను, శక్తిహీనమైన కులాల సరసన ఉండకుండా వేరు చేయాలి. ఆ విధంగా శక్తిమంతమైన కులాలు, శక్తిహీనమైన కులాలకు అడ్డురాకుండా కాపాడాలి.షెడ్యూల్డ్ కులాలు తెగలలోని శక్తిమంతమైన కులాలను వెనుకబడిన తరగతులు ‘ ఎ ‘ గ్రూపులోను, వెనుకబడిన తరగతులలోని శక్తిమంతమైన కులాలను దాని క్రింది గ్రూపులోను చేర్చాలి. ఆ విధంగా ప్రతి అయిదేళ్ళకొకసారి మార్పు తలపెట్టాలి. ప్రతి పంచవర్ష ప్రణాళికలోను ఆయా హీన కులాల అభివ్రుద్ధి కోసం పేరు పేరు వరుసన నిధులు కేటాయించి అవి వారికే అందేలా చూడాలి. అయిదేళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఆ కులం స్థాయి సాంఘికంగాను, ఆర్ధికంగాను బాగుపడాలి. ఆ విధంగా కాలక్రమేణా రిజర్వేషన్ల చట్రంలో నుండి అన్ని కులాలు తొలగిపోవాలి. కులం పేరు మీద ఇక ఎవ్వరూ రిజర్వేషన్ కోరలేని పరిస్థితి రావాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: