మాంసాహారము

మాంసాహారము గురించి ప్రసాదుగారి జాబు చదివి నా అభిప్రాయాన్ని ఇక్కడ కూడ వ్యక్తం చేస్తున్నాను.

అ) జంతువులను మనం చంపుతున్నామంటున్నారు, కాని మనం చంపకపోయినాకాని అవి ఎప్పటికైనా మరణించవలసినవే కద. ఒక్కసారిగా చనిపోతే కలిగే భాద (మనిషిచేతిలో కానివ్వండి లేదా మరెలా అయినా..) వృద్దాప్యం ద్వారానో లేదా ఏదయినా వ్యాధి వల్లనో చనిపోతే కలిగే భాదకంటే తక్కువే. ఇక్కడ నేను చెప్పదలచుకున్న విషయం ఏమిటంటే చంపడాన్ని పాపకు అపచారం చెయ్యడంతో పోల్చలేం.

ఆ) ఇదే విషయాన్ని మనుషులకు వర్తింపచేయలేం ఎందుకంటే మనిపి చనిపోయినప్పుడు అతని కంటే అతని మీద ఆధారపడి జీవించేవాళ్ళే ఎక్కువ భాదపడతారు. పైగా ఒక మనిషి చనిపోయేటప్పుడు భాద పడేది శారీరికంగా కంటే మానసికంగావే ఎక్కువ. ఎవరికైనా చావు, దానితోపాటు కలిగే శారీరక భాద తప్పని విషయం, కాని మానసిక భాద అనేది ఒక్క మనిషికే సొంతమని నేను నమ్ముతాను. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే జంతువులను చంపడాన్ని, మనుషులను చంపడాన్ని ఒక్కగాట కట్టలేము.

ఇ) ఇక జంతువులచేత పనిచేయించుకొనే విషయానికి వస్తే, పనిచేయింటుకోవడానికి హింసించడానికి చాలా తేడా ఉందని నా అభిప్రాయం. ఆ మాటకొస్తే మనం మనుషుల చేతకూడా చాలా పనులు చేయించుకుంటాం మరియు మనం వేరే వాళ్ళకు చేస్తుంటాం (లేక పోతే బ్రతకలేం కద).

ఈ) ఒక ప్రాణి చనిపోయిన తరువాత దాని శరీరంతో ఏమిచేసినా ఇక దానికి భాద ఏముంటుందండి. కాబట్టి, వాటి శరీరాలను కాల్చడమో, పూడ్చడమో చేసే బదులు వాటిని వాడుకోవడంలో నాకు తప్పేమి కనిపించడంలేదు.

మీకు నా మెదటి రెండు పాయింట్లలో నిజమున్నట్లు ఏమైనా అనిపిస్తే, ప్రసాదుగారు ఆ. లో వ్రాసింది ఇంకా వర్తిస్తుందేమో ఒకసారి ఆలోచించండి.

చివరగా నేను చెప్పదలచుకున్నదేమిటంటే ఏవో జంతువులు చనిపోతున్నాయని భాదపడేకంటే, తినడానికి తిండిలేకనో లేక మనం తీర్చగల్గే మరొక సమస్య వల్లనో, చస్తూ బ్రతికే వాళ్ళను ఆదుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది.

2 వ్యాఖ్యలు

  1. మంచిగా చెప్పారు.

  2. ప్రతి జీవి ఇంకొక జీవిని చంపుతూ తిని బ్రతుకుతుంది . తినడానికి పనికివచ్చే ప్రతీది ప్రాణమున్నదే . మొక్కలు , జంతువులకు ఒకలాంటి ప్రాణమే ఉంటుంది . కొన్ని మొక్కలూ కీటకాలను చంపి తింటాయి అని శాస్త్రము చెప్పుతోంది . మరి చంపడమనేది ప్రకృతిసహజమే కదా ! పుట్టిన ప్రతిజీవి చనిపోవడం … తప్పదుకదా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: