మాంసాహారము

మాంసాహారము గురించి ప్రసాదుగారి జాబు చదివి నా అభిప్రాయాన్ని ఇక్కడ కూడ వ్యక్తం చేస్తున్నాను.
అ) జంతువులను మనం చంపుతున్నామంటున్నారు, కాని మనం చంపకపోయినాకాని అవి ఎప్పటికైనా మరణించవలసినవే కద. ఒక్కసారిగా చనిపోతే కలిగే భాద (మనిషిచేతిలో కానివ్వండి లేదా మరెలా అయినా..) వృద్దాప్యం ద్వారానో లేదా ఏదయినా వ్యాధి వల్లనో చనిపోతే కలిగే భాదకంటే తక్కువే. ఇక్కడ నేను చెప్పదలచుకున్న విషయం ఏమిటంటే చంపడాన్ని పాపకు అపచారం చెయ్యడంతో పోల్చలేం.
ఆ) ఇదే విషయాన్ని మనుషులకు వర్తింపచేయలేం ఎందుకంటే మనిపి చనిపోయినప్పుడు [...]