ఐ.ఐ.టి – ఐ.టి.ఐ

గిరి గారు వ్రాసిన A bolt from the blue అనే టపా చూశాక నాకు ఇది గుర్తొచ్చింది.
మా మిత్రుడొకరికి, ఐ.ఐ.టి బాంబే లో సీటు వచ్చింది. బాంబే వెళ్లబోయే ముందు బట్టలు కుట్టించుకోడానికి వాళ్ల ఇంటి దగ్గరున్న టైలరుకు దగ్గరకు వెళ్లాడు. అప్పుడు వారి మద్య జరిగిన సంభాషణ ఇది.
టైలరు: చదువుకోడానికి బొంబాయి వెళ్తున్నావటగా?
మిత్రుడు: అవును ఐ.ఐ.టి బొంబాయిలో సీటొచ్చింది.
టైలరు: ఇంకొంచం కష్టపడి చదివితే గుంటూరు డాన్ బాస్కో ఐ.టి.ఐ లోనే సీటొచ్చేది కదా. మీవాళ్లు నిన్నంత [...]

వాసిరెడ్డి రంజిత్

ఈరోజు (మే 7) మితృడు, ఒక గొప్ప విధ్యార్ధి అయిన వాసిరెడ్డి రంజిత్ 25వ జన్మదినం. చిన్నవయసులోనే ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన రంజిత్ గత సంవత్సరం జులై 10న ఈత కొలనులో ప్రమాదవశాత్తు మునిగి, తనువు చాలించాడు. అతని సి.వి.లో 1981 మే 7 జన్మదినం అని ఉన్నా నిజానికి అతను 1982 లోజన్మించాడు. ఒక మంచి ఫ్రొఫెసరు అవుతాడనుకున్న రంజిత్, 25 సంవత్సరాలు కూడా నిండకుండానే మనల్ని వీడి వెళ్లిపోవడం భాదాకరమైన విషయం. రంజిత్ [...]

రిజర్వేషన్లు

రిజర్వేషన్ల ముఖ్యోద్దేశ్యం వెనుక బడిన వర్గాలవారిని ముందుకు తీసుకురావడమయినా,  అది ఎలా సాదిస్తారు అనే విషయం ఆలోచిస్తే ఈ క్రింది రెండు విధాలు కనిపిస్తాయి.
అ. రిజర్వేషన్ల వల్ల ఆయా వర్గాలలోని వారికి విధ్య, ఉద్యోగాలలో చాలా సులభంగా అవకాశాలు లభిస్తాయి. దీని వల్ల ఆ వర్గాలవారు చదువుల మీద ఆసక్తిని పెంచుకుని, విధ్యావంతులై ,ఉద్యోగస్తులై అభివృద్ది చెందుతారు.
ఆ. అదేవిదంగా ఆయావర్గాలలోని కొందరు, ఉన్నత స్థానాలను అదిరోహించి మిగతా వారికి ప్రేరణ కల్గిస్తారు. దీని వల్ల మిగతావారిలో కూడా గొప్పవారు కావాలనే [...]